పాకిస్థానీ స్టార్ స్నూకర్ ఆటగాడు మాజిల్ అలీ ఆత్మహత్య
పాకిస్థానీ స్నూకర్ ఆటగాడు, ఆసియా అండర్-21 రజత పతక విజేత మజిద్ అలీ(28) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం పంజాబ్ లోని ఫైసలాదాద్ సమీపంలోని సుముంద్రిలో మజిల్ అలీ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మాజిద్ చిన్నతనం నుంచే డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, కలప యంత్రంతో గాయం చేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అతను పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పాకిస్థాన్ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. అదే విధంగా జాతీయ సర్క్యూట్‌లో మాజిద్ అగ్రశేణి ఆటగాడిగా ఎదిగాడు. నెల వ్యవధిలో రెండవ స్నూకర్ ఆటగాడు మజిద్ మరణించడం విచారకరం. గత నెలలో మరో అంతర్జాతీయ స్నూకర్ ఆటగాడు ముహమ్మద్ బిలాల్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
మజిద్ మరణంతో కుటుంట సభ్యులు కన్నీరుమున్నీరు
మజిద్ మరణం చాలా బాధాకరమైన విషయమని, అతను తన ప్రాణాలను తీసుకుంటాడని తామెప్పుడూ ఊహించలేదని మజిద్ సోదరుడు ఉమర్ చెప్పారు. పాకిస్థాన్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ చైర్మన్ అంగీర్ షేక్ మాట్లాడుతూ మజీద్ చాలా ప్రతిభ కలిగిన ఆటగాడు అని, పాకిస్థాన్ కు మరెన్నో అవార్డులు తీసుకొస్తాడని చాలా ఆశించామని, అయితే మజిద్ మృతి పట్ల పాక్ మొత్తం విచార వ్యక్తం చేసిందని, అతనికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే మజిద్ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.