
IPL: వేలంలోకి పంత్, రాహుల్, అయ్యర్.. భారీ ధర పలకనున్న స్టార్ ప్లేయర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్ జాబితా విడుదలైంది. ఐపీఎల్-2024 మెగా వేలానికి ముందు పది జట్లు తమకు నమ్మకమైన ఆటగాళ్లను నిలుపుకున్నాయి.
అందరూ ఊహించినట్లుగానే దిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్‌ను విడుదల చేయగా, లక్నో సూపర్ జెయింట్స్ కూడా కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో వదిలేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ ను వదులు కోవడం విశేషం.
రిషభ్ పంత్ (ఢిల్లీ), కేఎల్ రాహుల్ (లక్నో), శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా) వంటి ప్రముఖ ఆటగాళ్లను జట్లు విడిచిపెట్టడంతో వీరిపై వేలంలో పోటీ రసవత్తరంగా మారబోతోంది
ఆర్సీబీ
విరాట్ కోహ్లీకి రూ. 21 కోట్లు, రజత్ పాటిదార్‌కు రూ. 11 కోట్లు, యశ్ దయాల్‌కు రూ. 5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది.
Details
ఢిల్లీ క్యాపిటల్స్
కెప్టెన్ రిషభ్ పంత్‌ను వదిలిపెట్టగా, అక్షర్ పటేల్‌ను రూ. 16.5 కోట్లకు రిటైన్ చేసింది. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్‌లను కూడా కొనసాగించింది.
లక్నో సూపర్ జెయింట్స్
నికోలస్ పూరన్‌కు రూ. 21 కోట్లు, రవి బిష్ణోయి, మయాంక్ యాదవ్‌లకు తలా రూ. 11 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్
హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్.
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
Details
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, ఎంఎస్ ధోనీ.
కోల్‌కతా నైట్ రైడర్స్
రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రానా.
రాజస్థాన్ రాయల్స్
సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, అశ్విన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్.
గుజరాత్ టైటాన్స్
రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్.
పంజాబ్ కింగ్స్
శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్.