Paris Paralympics 2024: క్లబ్ త్రోలో డబుల్ బ్లాస్ట్...ధరంబీర్ స్వర్ణం, ప్రణబ్ సుర్మా రజతం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా,భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. క్లబ్ త్రో F51 ఈవెంట్‌లో ధరంబీర్ నైన్ స్వర్ణ పతకం సాధించాడు.బుధవారం ఆర్ధరాత్రి తర్వాత జరిగిన ఫైనల్‌లో 34.92 మీటర్ల త్రో సాధించిన ధరంబీర్.. పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో పారాలింపిక్స్ చరిత్రలో క్లబ్ త్రో ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా ధరంబీర్ నిలిచాడు. మరోవైపు,ఇదే ఈవెంట్‌లో ప్రణబ్ సుర్మా రజత పతకం పొందాడు.ఫైనల్లో 34.59 మీటర్ల త్రో సాధించిన ప్రణవ్..సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 24కు చేరింది.ఇందులో ఐదు బంగారు పతకాలు,9 కాంస్య,10 రజత పతకాలు ఉన్నాయి.