Page Loader
World Athletics Championships: ఫైనల్‌లో సత్తా చాటి, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పారుల్ చౌధరి
ఫైనల్‌లో సత్తా చాటి, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పారుల్ చౌధరి

World Athletics Championships: ఫైనల్‌లో సత్తా చాటి, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పారుల్ చౌధరి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

హంగేరి బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ పారుల్ ఛౌదరీ సత్తా చాటింది. మహిళల 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్ ఫైనల్‌లో 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరిన ఆమె జాతీయ రికార్డును నెలకొల్పింది. దీంతో 2024 పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ కు పారుల్ ఛౌదరీ అర్హత సాధించింది. బుధవారం జరిగిన హీట్స్ లో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన పారుల్, ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఆమె 11వ స్థానంలో నిలిచింది.

Details

క్రీడాకారులను అభినందించిన ప్రధాని మోదీ

2900 మీటర్ల స్ల్పిట్ వరకు 13వ స్థానంలో ఉన్న పారుల్, చివరి వంద మీటర్లలో స్ల్పిట్‌లో రెండు స్థానాలను మెరుగుపర్చుకుంది. మరోవైపు పురుషుల 400 మీటర్ల రిలే ఫైనల్‌లో అనస్‌ యాహియా, అమోజ్‌ జేకబ్, అజ్మల్, రాజేశ్‌ రమేశ్‌లతో కూడిన భారత బృందం ఐదో స్థానంలో సరిపెట్టుకుంది. భారత బృందం 2.59.92 సెకన్లలో గమ్యానికి చేరింది. ఇక ప్రపంచ అథ్లెటిక్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 4×400 మీటర్ల రిలేలో అనాస్‌, అమోజ్‌, రాజేశ్‌ రమేశ్‌, మొమ్మద్‌ అజ్మల్‌ రికార్డు సృష్టించి ఫైనల్స్‌లోకి ప్రవేశించారని, వారి ప్రతిభ అద్భుతమని మోదీ పేర్కన్నారు.