LOADING...
IPL 2026: సన్‌రైజర్స్‌‌కు గుడ్ న్యూస్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కమిన్స్
సన్‌రైజర్స్‌‌కు గుడ్ న్యూస్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కమిన్స్

IPL 2026: సన్‌రైజర్స్‌‌కు గుడ్ న్యూస్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కమిన్స్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 25, 2026
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు ఆనందకరమైన వార్త వచ్చింది. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని, క్రికెట్‌ ఆస్ట్రేలియా నుంచి అనుమతి పొందిన ప్యాట్‌ కమిన్స్‌ శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించాడు. ' 'ఎన్నో రోజులుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. మైదానంలోకి దిగేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను'' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. జట్టు నాయకత్వ బాధ్యతలను కూడా తానే స్వీకరించనున్నట్లు కమిన్స్‌ స్పష్టం చేశాడు.

వివరాలు

ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకోనుందా?

తాత్కాలిక కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ జట్టు వరుసగా మూడు విజయాలు సాధించి మంచి ఊపులో ఉంది. ఇప్పుడు కమిన్స్‌ చేరికతో జట్టు మరింత బలపడనుంది. గాయంతో గత ఏడాది యాషెస్‌ సిరీస్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన కమిన్స్‌, ఈ సీజన్‌ ప్రారంభం నుంచి సన్‌రైజర్స్‌ జట్టుతోనే కొనసాగుతున్నాడు. హైదరాబాద్‌తో గత మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఈసారి తమ సొంత మైదానంలో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

Advertisement