
ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ : వన్డేలో 9వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన పాతుమ్ నిస్సాంక
ఈ వార్తాకథనం ఏంటి
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుతంగా రాణించాడు.
స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచులో హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. మొత్తంగా వన్డేల్లో తొమ్మిది హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు.
శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో లంకేయులు 49.3 ఓవర్లలో 245 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.
ఓపెనర్ నిస్సాంక 85 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అతనికి తోడు అస్సలంక 65 బంతుల్లో 63 పరుగులతో రాణించడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోరును చేసింది.
Details
వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన నిస్సాంక
ఈ మ్యాచులో అర్ధ సెంచరీతో రాణించిన నిస్సాంక వన్డే క్రికెట్‌లో 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను 30 ODIల్లో 37 సగటుతో 1,036 పరుగులు చేశాడు.
ఇందులో ఒక సెంచరీతో పాటు 9 అర్ధ సెంచరీలున్నాయి. వన్డేల్లో అత్యధికంగా అతను 137 పరుగులు చేశాడు.
2021లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నిస్సాంక వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి నిలకడగా రాణిస్తూ శ్రీలంక జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే, స్కాట్‌లాండ్ బౌలర్ క్రిస్ గ్రీవ్స్ తన 6.3 ఓవర్లలో నాలుగు కీలక వికెట్లు తీసి శ్రీలంక బ్యాటర్లను పెవిలియానికి పంపాడు.