Page Loader
PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. జైపూర్ వేదికగా తలపడనున్న పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌
జైపూర్ వేదికగా తలపడనున్న పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌

PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. జైపూర్ వేదికగా తలపడనున్న పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో మరోసారి ఉత్కంఠభరితమైన పోరాటానికి రంగం సిద్ధమైంది. ఈరోజు జైపూర్‌ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఈ రెండు జట్లు, టాప్‌-2లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించిన పంజాబ్ 17 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే, ముంబై కూడా 13 మ్యాచ్‌లలో 8 విజయాలతో 16 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుకు టాప్‌-2లో స్థానం ఖరారు అవుతుందని తెలుస్తోంది. అందువల్ల ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.

వివరాలు 

టాప్-2లో ఎవరుంటారో..?

ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలిస్తే, దాదాపుగా అగ్ర స్థానం ఖరారు అవుతుంది. ప్రస్తుతం పంజాబ్ నెట్ రన్‌రేట్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల బెంగళూరు తన చివరి మ్యాచ్ గెలిచినా కూడా పంజాబ్ రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. మరోవైపు, పంజాబ్‌పై ముంబై గెలిస్తే కనీసం రెండో స్థానం ఖాయమవుతుంది. లక్నో చేతిలో బెంగళూరు ఓడితే మాత్రం ముంబైకి ఏకంగా అగ్రస్థానం దక్కుతుంది. అలాగే నెట్ రన్‌రేట్‌లో ముంబై ముందు ఉండడం కూడా వారికి అదనపు బలం. ఈ నేపథ్యంలో, ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో, టాప్-2లో ఎవరుంటారో చూడాలి.