
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ 2024 పాకిస్థాన్ జట్టు ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2024 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ శుక్రవారం వెల్లడించింది.
మెగా టోర్నీలో పాక్ జట్టును బాబర్ ఆజమ్ నడిపించనున్నాడు.స్టార్ పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు.
రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు జట్టులో చోటు దక్కడం విశేషం.
ప్రదర్శన,ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టు ప్రకటనను పీసీబీ ఆలస్యం చేసిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ జట్టు:
బాబర్ ఆజమ్ (కెప్టెన్),అబ్రార్ అహ్మద్,ఆజం ఖాన్, ఫఖర్ జమాన్,హరీస్ రవూఫ్,ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం,మహ్మద్ అబ్బాస్ అఫ్రిది,మహ్మద్ అమీర్,మహ్మద్ రిజ్వాన్,నసీమ్ షా,సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ,ఉస్మాన్ ఖాన్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ట్వీట్
Bracing for the action 🏏
— Pakistan Cricket (@TheRealPCB) May 24, 2024
Preps 🔛 for the next T20I 📸#ENGvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/lO9PwLvWqu