
Asia Cup 2023:పీసీబీ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ కు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీపీ రాజీవ్ శుక్లా
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత భారత్ ,పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలునిలిపేసిన సంగతి తెలిసిందే.
చాలా సంవత్సరాల అనంతరం BCCI ప్రతినిధి ఆసియా కప్ 2023 సందర్భంగా పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు.
పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ఆహ్వానాన్ని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, భారత బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఆమోదించిన తర్వాత పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆహ్వానాన్ని అంగీకరించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
ఆసియా కప్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆగష్టు 30న పాక్-నేపాల్ జట్ల మధ్య జరుగనుంది.
టోర్నీలో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 2న శ్రీలంక పల్లెకెలెలో జరిగే మ్యాచ్‌కు రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లాతో కలిసి బీసీసీఐ సెక్రెటరీ జైషా హాజరుకానున్నారు.
Details
పీసీబీ నిర్వహించనున్న అధికారిక విందు కోసం బిన్నీ, శుక్లా
అనంతరం భారత్‌కు చేరుకొని ఇక్కడి నుంచి బిన్నీతో కలిసి రాజీవ్ శుక్లా వాఘా సరిహద్దు మీదుగా లాహోర్‌కు వెళ్లనున్నారు .
2004లో సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉండగా టీమిండియా జట్టుతో కలిసి రాజీవ్ శుక్లా పాక్‌కు వెళ్లారు.
సెప్టెంబన్ 4న లాహోర్‌లో పీసీబీ నిర్వహించనున్న అధికారిక విందు కోసం బిన్నీ, శుక్లాను పీసీబీ ఆహ్వానించింది.
జులై 19న ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ను జే షా ప్రకటించారు. ఈ టోర్నీఆగస్టు 30న ప్రారంభం కానుంది.
పాకిస్థాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి.
గ్రూప్-ఏలో భారత్,పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.