
PCB: భవిష్యత్తులో WCLలో పాల్గొనకూడదని పీసీబీ కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక ప్రకటన చేసింది. ఇకపై తమ ఆటగాళ్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ (WCL) లాంటి టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ లీగ్ నిర్వాహకులు పక్షపాత ధోరణి చూపించారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లకు చోటుండకూడదని టీమ్ఇండియా మాజీలు అభిప్రాయపడ్డారు. ఇందుకు అనుగుణంగా, వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీలో భారత్ పాక్‌తో జరిగే రెండు మ్యాచ్‌లను బహిష్కరించింది. ఒకటి లీగ్ దశలో, మరొకటి సెమీఫైనల్లో. పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన ఇండియా ఛాంపియన్స్ నిర్ణయం తర్వాత, భారత్ సెమీస్‌కు వెళ్లకుండా బహిష్కరించగా, పాక్ నేరుగా ఫైనల్‌కు వెళ్లింది.
Details
నిర్వాహకులు పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు
ఫైనల్లోనూ పాక్‌తోనే తలపడాల్సి వచ్చినా తమ నిర్ణయాన్ని మళ్లీ అమలు చేస్తామని భారత్ ఛాంపియన్స్ సభ్యులు స్పష్టం చేశారు. అయితే భారత్ పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన సమయాన గ్రూప్ దశ మ్యాచ్‌కు ఇరు జట్లకు పాయింట్లు కేటాయించడాన్ని పీసీబీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది నిర్వాహకుల పక్షపాత ధోరణికి నిదర్శనమని విమర్శించింది. మోహ్‌సిన్ నఖ్వీ నేతృత్వంలో నిర్వహించిన పీసీబీ అత్యవసర సమావేశంలో ఈ అంశంపై చర్చించి, తదుపరి ఎలాంటి ప్రైవేట్ లీగ్‌ల్లో తమ ఆటగాళ్లు పాల్గొనరాదని నిర్ణయించారు. ఇంతకముందు భారత్ నిర్ణయానికి ప్రతిస్పందనగా, ప్రైవేట్ లీగుల్లో పాకిస్థాన్ పేరును వాడేందుకు బోర్డు అనుమతి తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఎవరైనా ఆ పేరు వినియోగించాలనుకుంటే పీసీబీ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.