పాంటింగ్, లారా వల్ల ప్లేయర్స్ ఎదగలేకపోతున్నారు : గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
ప్రపంచ క్రికెట్లో లెజెండరీ ప్లేయర్లు అయిన రికి పాంటింగ్, బ్రియన్ లారా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు విజయాలను అందించారు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ కి హెడ్ కోచ్ బ్రియన్ లారా, ఢిల్లీ క్యాపిటల్స్ కి హెడ్ కోచ్ గా పాంటింగ్ వ్యవరిస్తున్నారు. వీరిద్దరి సారథ్యంలో నడుస్తున్న ఈ రెండు జట్టు ఫ్లేఆఫ్స్ కి అర్హత సాధించలేకపోయాయి. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ పదో స్థానం,ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో రికిపాటింగ్, బ్రియన్ లారాపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఇద్దరి వల్లే ఆ రెండు టీమ్స్ ఫ్లే ఆఫ్స్ కి అర్హత సాధించలేకపోయాయని అగ్రహం వ్యక్తం చేశాడు.
యువ ఆటగాళ్లు ఎదగడం లేదు
రికి పాంటింగ్, బ్రియన్ లారా వల్ల కొంతమంది ప్లేయర్స్ ఎదగలేకపోతున్నారని, అసలు పాంటింగ్ కోచింగ్ లో ఎలాంటి పురోగతి లేదని సన్నీ అభిప్రాయపడ్డాడు. సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, ప్రియమ్ గార్గ్ లాంటి ఆటగాళ్లు రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇక చాలాసారలు వాళ్ల భాష కూడా అడ్డంకిగా మారుతోందని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే ప్లేయర్స్ ఇంగ్లీష్ ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని, అందుకే ఆ ఫ్లేయర్స్ అక్కడే అగిపోతున్నారని సన్నీ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా అక్షర పటేల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేయడంలో పాంటింగ్ మొండిగా వ్యవహరించాడని తెలిపారు.