Page Loader
Aryna Sabalenka : ఆస్ట్రేలియన్ ఓపెన్ డిఫెన్స్ కోసం బ్రిస్బేన్‌తో వార్మప్‌లో మ్యాచ్ ఆడనున్న అరీనా సబలెంకా
ఆస్ట్రేలియన్ ఓపెన్ డిఫెన్స్ కోసం బ్రిస్బేన్‌తో వార్మప్‌లో మ్యాచ్ ఆడనున్న అరీనా సబలెంకా

Aryna Sabalenka : ఆస్ట్రేలియన్ ఓపెన్ డిఫెన్స్ కోసం బ్రిస్బేన్‌తో వార్మప్‌లో మ్యాచ్ ఆడనున్న అరీనా సబలెంకా

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2023
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

టెన్నిస్ స్టార్ ప్లేయర్ ఆరీనా సబలెంకా(Aryna Sabalenka) ఈ ఏడాది ప్రారంభంలో మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్‌లో ఎలెనా రైబాకినా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆరీనా సబలెంకా డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు జరిగే బ్రిస్బేట్ ఈవెంట్‌లో ఆడుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచిన నవోమి ఓసాకా తిరిగి రావడంతో ఆరీనా సబలెంకాను బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. అరీనా సబలెంకా బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో ఆడడం ద్వారా తన ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు నిర్వాహకులు మంగళవారం తెలిపారు.

Details

ఆస్ట్రేలియాపై ప్రత్యేకమైన అభిమానం ఉంది : ఆరీనా సబలెంకా

2024 ఆస్ట్రేలియన్ సీజన్‌ను బ్రిస్బేన్‌లో ప్రారంభించడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని అరీనా సబలెంకా పేర్కొన్నారు. అక్కడే తాను తన తొలి గ్రాండ్ స్లామ్ గెలిచానని, ఆస్ట్రేలియాకు ఎప్పుడు తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని ఆమె వెల్లడించారు. టోర్నమెంట్ డైరెక్టర్ కామ్ పియర్సన్ మాట్లాడుతూ సబాలెంకా, రైబాకినాకు స్వాగతం పలకడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఈ ఏడాది ప్రారంభంలో బాలికలు ఆడిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌ను అందరికి గుర్తిండిపోయిందని అతను వెల్లడించారు. ఇది నిజంగా ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఉత్కంఠమైన పోటీ ఉంటుందన్నారు.