Independence Day 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లను కలిసిన నరేంద్ర మోదీ
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న భారత క్రీడాకారులను భారత ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు. షూటర్లు మను భాకర్, సరబ్జోత్ సింగ్, రెజ్లర్ అమన్ సెహ్రావత్ సహా భారత పురుషుల హాకీ జట్టు సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమై వారిని ప్రశంసించారు. ఈ వార్తపై ఓ లుక్కేద్దాం.
ప్రధాని మోదీకి జెర్సీని బహుకరించిన భారత పురుషుల హాకీ జట్టు
ప్రధాని మోదీ అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో భారత పురుషుల హాకీ జట్టు హాకీ స్టిక్‌ను మోదీకి బహుమతిగా అందించింది. ఈ సందర్భంగా భారత మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ కూడా పాల్గొన్నారు. అతను పారిస్ గేమ్స్ తర్వాత హాకీ నుండి రిటైర్ అయ్యి .. జూనియర్ స్థాయిలో జట్టుకు కోచ్‌గా నియమించబడ్డాడు. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.