LOADING...
Nicholas Pooran:వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్‌ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్‌ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

Nicholas Pooran:వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్‌ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
08:03 am

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇది తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటిగా పేర్కొంటూ, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా దీనిని అధికారికంగా ప్రకటించాడు. పూరన్ విండీస్ తరఫున 61 వన్డేల్లో 1,983 పరుగులు చేయగా, 106 టీ20 మ్యాచ్‌ల్లో 2,275 పరుగులు నమోదు చేశాడు.

వివరాలు 

అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు

నిక్కీపీ అని అభిమానులు ముద్దుగా పిలిచే పూరన్ ఇటీవలే టీ20 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. జట్టులో కీలకమైన ఆటగాడిగా మారిన అతను, వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ఇంకా 8 నెలల సమయం ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులతో పాటు జట్టును షాక్‌కు గురిచేశాడు. ఈ నిర్ణయం తాను చాలా ఆలోచించి తీసుకున్నదని స్పష్టం చేశాడు. తనపై ఎప్పుడూ ప్రేమ చూపించిన అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నికోలస్ పూరన్