LOADING...
SA Vs WI: పేస్‌ వర్సెస్‌ పవర్‌ హిట్టింగ్‌.. సూపర్‌-8లో హై వోల్టేజ్‌ క్లాష్
పేస్‌ వర్సెస్‌ పవర్‌ హిట్టింగ్‌.. సూపర్‌-8లో హై వోల్టేజ్‌ క్లాష్

SA Vs WI: పేస్‌ వర్సెస్‌ పవర్‌ హిట్టింగ్‌.. సూపర్‌-8లో హై వోల్టేజ్‌ క్లాష్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశలో గురువారం జరిగే కీలక పోరులో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రెండూ జోరుమీద ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌ రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌ బ్యాటర్ల దూకుడుకు దక్షిణాఫ్రికా పేస్‌ దళం కఠిన సవాల్‌ విసరనుంది. గత మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా,మరోవైపు జింబాబ్వేపై వెస్టిండీస్‌ 107 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. దీంతో ఈ రెండు జట్లు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి.

వివరాలు 

ఇలా అయితే భారత్‌కు కొంత ఊరట 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ ఫలితం టీమ్‌ఇండియా సెమీఫైనల్‌ అవకాశాలపై కూడా ప్రభావం చూపనుంది. ఒకవేళ వెస్టిండీస్‌ విజయం సాధిస్తే, భారత్‌ సమీకరణాలు కఠినమవుతాయి. అటు వెస్టిండీస్‌ మాత్రం సెమీఫైనల్‌కు మరింత చేరువ అవుతుంది. భారత్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే తన చివరి రెండు మ్యాచ్‌లలో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే దక్షిణాఫ్రికా విండీస్‌ను ఓడిస్తే భారత్‌కు కొంత ఊరట లభిస్తుంది. ఆ పరిస్థితిలో విండీస్‌, జింబాబ్వేలపై గెలుపుతోనే భారత్‌ సెమీఫైనల్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.

Advertisement