Page Loader
PHL: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌కు హ్యాండ్‌బాల్ ఆసియా ఫెడరేషన్ మద్దతు
హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లోగో

PHL: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌కు హ్యాండ్‌బాల్ ఆసియా ఫెడరేషన్ మద్దతు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ వేదికగా నిర్వహిస్తున్న ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ కు ఆసియా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ మద్దతు తెలపడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు దక్షిణ ఆసియా హ్యాండ్ బాల్ ఫెడరేషన్‌కు, బ్లూ స్పోర్ట్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య వాణిజ్యపరమైన ఒప్పందం లభించింది. పురుషుల హ్యాండ్‌బాల్‌ను 20 సంవత్సరాల కాలానికి పొడిగించడం కోసం బ్లూస్పోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఈ ఒప్పందం ప్రత్యేక హక్కులను మంజూరు చేస్తుంది. దీనివల్ల భారత్ ఈ క్రీడ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ప్రతినిధులు, ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్‌కి, టెక్నికల్ కమిటీకి నాయకత్వం వహిస్తారు.

హ్యాండ్‌బాల్

హ్యాండ్‌బాల్ అభివృద్ధికి కృషి

ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ కు ఇవి అద్భుతమైన క్షణాలని, పీహెచ్ఎల్ వ్యవస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని, భారత్ లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించే పీఎహెచ్ఎల్ తమ వంతు కృషి చేస్తుందని బ్లూస్పోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ మను అగర్వాల్, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్ వైస్‌ ప్రెసిడెంట్‌ బడెర్ మహమ్మద్‌ పేర్కొన్నారు. దక్షిణా ఆసియా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ మద్దతుగా నిలవడం ఆనందంగా ఉందని, ఆసియాలో హ్యాండ్ బాల్ గేమ్‌కు భారత్ లో మంచి మార్కెట్ ఉందని అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ బాదర్ మహ్మద్ వెల్లడించారు.