Loading...
Gautam Gambhir: ఆ టోర్నీ ముగిసిన వెంటనే ప్రిపరేషన్స్.. వన్డే వరల్డ్‌కప్‌పై గౌత‌మ్‌ గంభీర్ మాస్ట‌ర్‌ ప్లాన్!
ఆ టోర్నీ ముగిసిన వెంటనే ప్రిపరేషన్స్.. వన్డే వరల్డ్‌కప్‌పై గౌత‌మ్‌ గంభీర్ మాస్ట‌ర్‌ ప్లాన్!

Gautam Gambhir: ఆ టోర్నీ ముగిసిన వెంటనే ప్రిపరేషన్స్.. వన్డే వరల్డ్‌కప్‌పై గౌత‌మ్‌ గంభీర్ మాస్ట‌ర్‌ ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ‌క‌ప్ 2026 టైటిల్‌ను టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయానంతరం ఇప్పుడు టీమిండియా దృష్టి వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌పై పడింది. ఈ నేపథ్యంలో జట్టు హెడ్‌ కోచ్ గౌత‌మ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2026 సీజన్ ముగిసిన తర్వాత వన్డే వరల్డ్‌కప్‌ 2027 కోసం సన్నాహాలు ప్రారంభమవుతాయని గంభీర్ వెల్లడించాడు. అదే సమయంలో జట్టుకు సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్ సిద్ధమవుతుందని కూడా పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ 2027 కోసం మా సన్నాహాలు ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రారంభమవుతాయి.

Details

బ్లూ ప్రింట్ సిద్ధం చేశాం 

ఐపీఎల్ 2026 నుంచి వన్డే వరల్డ్‌కప్‌ వరకు దాదాపు 25 నుంచి 30 వన్డే మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఎక్కువగా జరగడం లేదు. కాబట్టి ఎంత త్వరగా ప్రిపరేషన్స్ ప్రారంభిస్తే అంత మంచిదని గంభీర్ ఒక ఇంటర్వ్యూలో వివరించాడు.

వన్డే మెగా టోర్నీ జరగనున్న సౌతాఫ్రికాలోనిపిచ్‌ల గురించి కూడా ఆయన మాట్లాడాడు.

దక్షిణాఫ్రికాలో క్రికెట్ ఆడటం అంత సులువు కాదు. అక్కడి పరిస్థితులకు తగినట్లుగా ఆడగలిగే ఆటగాళ్లను గుర్తించి జట్టులోకి ఎంపిక చేయాల్సి ఉంటుంది. సెలెక్టర్లు, కోచ్‌లు కలిసి ఆ ప్రక్రియను నిర్వహిస్తారు.

ఐపీఎల్ 2026ముగిసే సమయానికి వన్డే వరల్డ్‌కప్ 2027కోసం టీమిండియా పూర్తి స్థాయి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తుందని గౌతమ్ గంభీర్ వివరించాడు.

ADVERTISEMENT