
Rishabh Pant : చాలా మెరుగ్గా ఉన్నా.. తొలిసారి ఐపీఎల్ ఆక్షన్ ప్రక్రియలో రిషబ్ పంత్
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్‌లో ఐపీఎల్(IPL) వేలం కోసం రంగం సిద్ధమైంది. ఈ వేలంలో మాములుగా అయితే ఫ్రాంచైజీ యజమానులు, మెంటార్‌లు, కోచ్‌లు పాల్గొంటారు.
అయితే ఈ సారి వేలంలో ఓ కెప్టెన్ భాగం కానున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ సారిథి రిషబ్ పంత్(Rishabh Pant) ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే వేలంలో పాల్గొన్న తొలి కెప్టెన్‌గా పంత్ రికార్డు నెలకొల్పనున్నాడు.
ఇప్పటికే ఈ వేలం కోసం పంత్ దుబాయ్ కు చేరుకున్నాడు.
ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ పోస్టు చేసిన వీడియోలో పంత్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఐపీఎల్ వేలంలో పాల్గొనడం కొత్తగా ఉందని, తాను ఇంత వరకు వేలం ప్రక్రియలో భాగం కాలేదని, ప్రస్తుతం వేలం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.
Details
ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశం!
తాను చాలా మెరుగ్గా ఉన్నానని, రాబోయే కొద్ది నెలల్లో మరింత ఫిట్‌గా ఉండగలని వెల్లడించాడు.
ఒకవేళ పంత్ కోలుకుంటే IPL 2024లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ దాదాపు ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు.
అయితే తన యాక్సిడెంట్ నుంచి రికవరీ దాకా ఎంతో ప్రేమను అందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇక వచ్చే ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే సిరీస్ కోసం జట్టులోకి పంత్ తిరిగి వస్తాడని పలు నివేదికలు చెబుతున్నాయి.