LOADING...
Rashid Khan : భువనేశ్వర్‌ను వెనక్కి నెట్టి.. ఆసియా కప్‌లో రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర
భువనేశ్వర్‌ను వెనక్కి నెట్టి.. ఆసియా కప్‌లో రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర

Rashid Khan : భువనేశ్వర్‌ను వెనక్కి నెట్టి.. ఆసియా కప్‌లో రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025లో గ్రూప్-ఎ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు మంగళవారం రాత్రి తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ పోరులో బంగ్లాదేశ్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో క్రీజులోకి దిగిన అఫ్గానిస్థాన్, 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయడంతో పాటు చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌పై సాధించిన ఆ రెండు వికెట్లతో రషీద్ ఖాన్, టీ20 ఆసియా కప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

Details

టీ20 ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లు 

ఇంతకు ముందు భువనేశ్వర్ కుమార్ ఆరు మ్యాచ్‌లలో 13 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే, రషీద్ 10 మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టి ఆ రికార్డును అధిగమించాడు. రషీద్ ఖాన్ - 14 వికెట్లు భువనేశ్వర్ కుమార్ - 13 వికెట్లు వానిండు హసరంగా - 12 వికెట్లు అమ్జాద్ జావేద్ - 12 వికెట్లు హార్దిక్ పాండ్యా - 12 వికెట్లు

Details

టీ20 క్రికెట్ చరిత్రలో 650 పైగా వికెట్లు

ఇదే కాకుండా, రషీద్ ఖాన్ మొత్తం టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 650కిపైగా వికెట్లు తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ సంఖ్యలో వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం 700 వికెట్ల మైలురాయికి కేవలం 30 వికెట్ల దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో రషీద్ ఇప్పటి వరకు 171 వికెట్లు తీశాడు, ఇది ప్రపంచంలో ఏ ఆటగాడికీ లేని రికార్డు. అదనంగా, టీ20, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతని ఎకానమీ రేట్ ఏడు కంటే తక్కువగా ఉండటం విశేషం. ఈ గణాంకాలు ఆయనను ప్రపంచంలోనే గొప్ప టీ20 స్పిన్నర్‌గా నిలబెడుతున్నాయి.