మళ్లీ నిరాశపరిచిన పీవీ సింధు.. రెండో రౌండ్‌లోనే వెనుదిరిగిన భారత షట్లర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఫ్రీక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.
మరోసారి చైనీస్ తైపీ షట్లర్ తై జెయింగ్ చేతిలో పరాజయం పాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్ లో సింధు 18-21, 16-21 తేడాతో వరుస గేమ్స్ లో ఓటమిపాలైంది.
సింధుపై ఆమెకు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం గమనార్హం. ఈ ఏడాది ఒలింపిక్ విజేత సింధుకు ఏమాత్రం కలిసి రావడం లేదని చెప్పొచ్చు.
Details
క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన తై జెయింగ్ స్పెయిన్
ఇప్పటిదాకా తైజెయింగ్ తో 24 సార్లు పోటీపడ్డ సింధుకు ఇది 19వ ఓటమి కావడం విశేషం.
అమెపై కేవలం ఐదుసార్లు మాత్రమే విజేతగా నిలిచింది. సింధుపై గెలిచి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన తై జెయింగ్ స్పెయిన్ చెందిన కరోలినా మారిన్ తో అమీతుమీ తేల్చుకోనుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. ఆరంభం నుంచే సింధు తడబడింది. థాయ్ జూ యింగ్ దూకుడుగా ఆడి వరుసగా నాలుగు పాయింట్లను సాధించింది. ఆ తర్వాత పుంజుకున్న సింధు రెండు పాయింట్లు సాధించింది.
అనంతరం ఆమె జోరు ముందు పీవీ సింధు నిలవలేకపోయింది. మలేషియా మాస్టర్స్, థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీల్లోనూ సింధు అభిమానులను నిరాశపరిచిన విషయం తెలిసిందే.