Page Loader
వరుస వైఫల్యాలతో తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయిన పీవీ.సింధు
టాప్-10లో చోటు కోల్పోయిన పీవీ సింధు

వరుస వైఫల్యాలతో తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయిన పీవీ.సింధు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2023
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తోంది. తాజాగా బిడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్‌లో 2016 తర్వాత తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయింది. గతవారం ముగిసిన స్విస్ ఓపెన్ లో సింధు మహిళల సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి ఫ్రిక్వార్టర్‌లో నిష్ర్కమించింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన పీవీసింధు 60,448 పాయింట్లతో 11వ ర్యాంక్‌కు పరిమితమైంది. 2016 రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని పీవీ సింధు గెలుచుకుంది. ఆమె మొదట ఆగస్ట్ 2013లో టాప్ 10లోకి ప్రవేశించింది. ఇండియా ఓపెన్ సూపర్‌సిరీస్‌లలో ఆమె ఫైనల్స్‌లో కరోలినా మారిన్‌ను ఓడించి, ఏప్రిల్ 2017లో సింధు అప్పట్లో నెంబర్ 2 ర్యాంకును సాధించింది

పీవీ సింధు

31వ ర్యాంకులో సైనా నెహ్వాల్

సింధు తన కెరీర్‌లో అద్భుతమైన రికార్డును సాధించింది. రెండు ఒలింపిక్స్ పతకాలను సొంతం చేసుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచింది. 2016లో రియో ​​ఒలింపిక్స్ ఫైనల్స్‌లో మారిన్ చేతిలో ఓడిపోయిన సింధు, రజతంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్‌ కు చెందని మరో స్టార్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సైనా నెహ్వాల్ ఒక స్థానం ఎగబాకి 31వ ర్యాంక్‌లో నిలవడం విశేషం.