
P.V. Sindhu: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పీవీ సింధుకు చేదు అనుభవం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి.సింధుకి ఆస్ట్రేలియా ఓపెన్ లో చేదు అనుభవం ఎదురైంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్స్ లో అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ చేతిలో 21-12, 21-17 తేడాతో పీవీ సింధు ఓటమిపాలైంది.
ఆస్ట్రేలియా ఓపెన్ లో నాలుగో సారి సెమీస్ కు చేరుదామని భావించిన పీవీ సింధుకు నిరాశే మిగిలింది.
ఇప్పటివరకూ 10 మ్యాచుల్లో బీవెన్ తో తలపడి ఆరు విజయాలను నమోదు చేసిన సింధు, ఈసారి మాత్రం గెలవలేకపోయింది.
Details
ఆగస్టు 21 నుంచి వరల్డ్ చాంపియన్ షిప్
ఆగస్టు 21 నుంచి డెన్మార్క్‌లోని కోపెన్ హెగన్‌లో వరల్డ్ చాంపియన్ షిప్ నిర్వహించనున్నారు. అయితే ఈ మెగా టోర్నీకి ముందు పీవీ సింధు ఫామ్ లో లేకపోవడం కాస్త ఆందోళనకరంగా మారింది. 2019లో వరల్డ్ చాంపియన్ గా పీవీ సింధు నిలిచింది.
ఇటీవల గాయాల నుంచి కోలుకొని మళ్లీ బ్యాడ్మింటన్ లో రాణిస్తోంది. అయితే ఈ ఏడాది జరిగిన 12 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీల్లో ఆమె పాల్గొంది. ఇందులో ఏడింటిలో ఆమె పరాజయం పాలైంది.
2003లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ అయిన మహమ్మద్ హఫీజ్ హసీమ్ వద్ద పీవీ సింధు శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే.