Page Loader
ఫైనల్లో ఇండోనేసియా ప్లేయర్‌ మరిస్కా చేతిలో ఓడిన పీవీ.సింధు
రన్నరప్‌గా నిలిచిన పీవీ. సింధు

ఫైనల్లో ఇండోనేసియా ప్లేయర్‌ మరిస్కా చేతిలో ఓడిన పీవీ.సింధు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2023
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ 2023లో మహిళల సింగిల్స్ ఫైనల్‌లో పివీ సింధు పరాజయం పాలైంది. భారత షట్లర్ గ్రెగోరియా మారిస్కా తుంజంగ్‌పై 8-21, 8-21 తేడాతో ఓటమిపాలైంది. సింధుపై తుంజంగ్‌కి ఇదే తొలి విజయం గమనార్హం. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు ప్రస్తుతం 11వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. రెండవ సీడ్‌గా ఆడుతున్న ఆమె అంతకుముందు ఆడిన టోర్నమెంట్‌లలో రెండవ రౌండ్‌ను దాటి, ఏడాది తర్వాత మొదటిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. సింగపూర్‌కు చెందిన యో జియా మిన్‌పై సెమీఫైనల్ పోరులో సింధు 24-22, 22-20 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఫైనల్లోకి దూసుకెళ్లింది.

పీవీ.సింధు

రన్నరప్‌గా నిలిచిన సింధు

గతంలో సింధుతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన మరిస్కా ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. ఫైనల్లో సింధు ఏ దశలోనూ మరిస్కాకు పోటీని ఇవ్వలేకపోయింది. విన్నర్‌ మరిస్కాకు 15,750 డాలర్లు (రూ. 12 లక్షల 93 వేలు), రన్నరప్‌ సింధుకు 7,980 డాలర్లు (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. నవంబర్ 2016 తర్వాత మొదటిసారిగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు టాప్ 10 ర్యాంకింగ్స్ నుండి తప్పుకుంది.