PV Sindu: పెళ్లి పీటలెక్కనున్న పి.వి.సింధు.. వరుడు ఎవరంటే?
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రెండు ఒలింపిక్ పతకాల విజేత, ప్రపంచ మాజీ ఛాంపియన్ పివి.సింధు పెళ్లి పీటలెక్కనుంది. హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయి ఆమె జీవిత భాగస్వామిగా మారబోతున్నారు. ఈ జంట వివాహం డిసెంబరు 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరగనుంది. సింధు తండ్రి పివి. రమణ పెళ్లి గురించి తెలియజేశారు. తమ కుటుంబాలు చాలా కాలంగా సన్నిహితంగా ఉన్నాయని, కానీ నెల క్రితమే ఈ వివాహ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జనవరి నుండి సింధుకు టోర్నీలు ఉండడంతో డిసెంబరు 22నే వివాహ వేడుకకు తగిన ముహూర్తం చూసుకున్నామని తెలియజేశారు.
డిసెంబర్ 22న వివాహం
డిసెంబరు 24న హైదరాబాద్‌లో ఆత్మీయులకు విందు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రముఖులు హాజరుకానున్నారు. డిసెంబర్ 20 నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. 22 ఉదయ్‌పుర్‌లో వివాహం, 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.