Page Loader
Ravichandran Ashwin: చరిత్ర సృష్టించనున్న భారత స్పిన్నర్.. పలు రికార్డులకు చేరువలో రవిచంద్రన్ అశ్విన్
చరిత్ర సృష్టించనున్న భారత స్పిన్నర్.. పలు రికార్డులకు చేరువలో రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: చరిత్ర సృష్టించనున్న భారత స్పిన్నర్.. పలు రికార్డులకు చేరువలో రవిచంద్రన్ అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2024
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకెళ్తుతున్నాడు. ఇప్పటికే టీమిండియా తరుఫున టెస్టుల్లో 522 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇక బ్యాటింగ్ లోనూ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. బంగ్లాతో జరిగిన టెస్టు మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగి (113) శతకంలో పాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో టెస్టు చరిత్రలో ఐదు వికెట్లు తీసిన రెండో అత్యధిక ఆటగాడిగా అశ్విన్, ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ సరసన నిలిచాడు. ఇక కాన్పూర్‌లో జరగే రెండో టెస్టు ముందు అశ్విన్ పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం..

Details

అశ్విన్ ను ఊరిస్తున్న రికార్డులివే

1) అశ్విన్ ఒక వికెట్ తీస్తే టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా నిలవనున్నాడు. 2)బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో జహీర్ ఖాన్ తీసిన 31 వికెట్ల రికార్డును అధిగమించడానికి అశ్విన్‌కు కేవలం 3 వికెట్లు అవసరం. 3)ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ప్రస్తుతం అశ్విన్ 48 వికెట్లతో ఉన్నాడు. మరో నాలుగు వికెట్లు సాధిస్తే జోష్ హేజిల్‌వుడ్‌ను అధిగమించి టాప్ వికెట్ టేకర్‌గా అవతరిస్తాడు. 4)నాథన్ లియాన్‌ సాధించిన 187 వికెట్ల రికార్డును అధిగమించడానికి అశ్విన్‌కు మరో ఎనిమిది వికెట్లు అవసరం. 5)మరో తొమ్మిది వికెట్లు సాధిస్తే అశ్విన్ లియాన్‌ (530)ను అధిగమించి టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలుస్తాడు.