తదుపరి వార్తా కథనం
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నియామకం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 04, 2024
05:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2025లో ఆ జట్టు హెడ్ కోచ్ గా ఆయన బాధ్యతలను చేపట్టనున్నాడు.
రాజస్థాన్ ఫ్రాంచైజీతో ద్రావిడ్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడని ESPNcricinfo పేర్కొంది.
టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇటీవలే టీ20 వరల్డ్ కప్ 2024 గెలుచుకుంది. ఈ ట్రోఫీ తర్వాత ద్రావిడ్ రిటైర్మెంట్ ప్రకటించారు.
ద్రవిడ్ హయాంలో భారత బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోర్‌ను రాయల్స్ ఫ్రాంచైజీ తన అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకోవచ్చని ESPNCricinfo తెలిపింది.
2012, 2013లో సీజన్‌లలో రాయల్స్ కెప్టెన్ గా, 2014, 2015లో రాజస్థాన్ జట్టు మెంటార్ గా ద్రావిడ్ కొనసాగిన విషయం తెలిసిందే.