
IND vs AUS: భారీ ఆధిక్యానికి వర్షం అడ్డంకి.. ఆసీస్ వ్యూహాలకు ఎదురుదెబ్బ
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా గబ్బా టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసి భారత్‌కు సవాలుగా నిలిచే లక్ష్యం నిర్దేశించాలనుకుంది.
అయితే ఐదో రోజు ఆటకు వరుణుడు విఘాతం కలిగించాడు. లంచ్ బ్రేక్‌ను ముందుగా ప్రకటించిన అంపైర్లు, ఆట తిరిగి ప్రారంభమయ్యేలోపే వర్షం మైదానాన్ని మొదలైంది.
ఓవర్‌నైట్ స్కోరు 252/9తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... కేవలం 8 పరుగులు జోడించి 260 పరుగులకే ఆలౌటైంది.
ఆకాశ్ దీప్ (31) చివరి వికెట్‌గా పెవిలియన్ చేరగా, జస్‌ప్రీత్ బుమ్రా (10*) నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయడంతో, భారత్‌పై 185 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.
Details
వరుణుడి ఆటంకంతో గబ్బా టెస్టు ఉత్కంఠ
భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే బ్యాడ్ లైటింగ్ కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది.
ఫ్లడ్‌లైట్లను సిద్ధం చేయడంతో పాటు వర్షం మైదానాన్ని తడవడంతో గంటన్నర పాటు ఆట రద్దయింది.
అంపైర్లు మొత్తం 98 ఓవర్ల ఆటను కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఆటకు మరిన్ని అంతరాయాలు కలగే అవకాశముందని సమాచారం.
మైదానం సిద్ధం కాగానే ఆసీస్ దూకుడుగా పరుగులు రాబట్టే వ్యూహంతో మైదానంలోకి దిగనుంది.
వర్షం కారణంగా ఆట సమయం తగ్గే అవకాశాలు ఉండటంతో ఆసీస్ 300 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఎదుట ఉంచే అవకాశం ఉంది.
details
ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్
మ్యాచ్‌కు వరుణుడు వరుసగా అంతరాయం కలిగిస్తుండటంతో, గబ్బాలో భారత్ కనీసం డ్రా సాధించగలదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో భారత బ్యాటర్లు పట్టు చూపించి వికెట్లు రక్షించడమే అత్యంత కీలకం. వాతావరణం సహకరిస్తే ఆటలో ఉత్కంఠత మరింత పెరిగే అవకాశముంది.
వేగంగా రన్స్ చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనే తొందర్లో ఆసీస్ కీలక వికెట్లను కోల్పోయింది.
ప్రస్తుతం ఆసీస్ 33 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.