LOADING...
IPL: ఐపీఎల్‌లోకి షనక రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన రాజస్థాన్‌ రాయల్స్
ఐపీఎల్‌లోకి షనక రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన రాజస్థాన్‌ రాయల్స్

IPL: ఐపీఎల్‌లోకి షనక రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన రాజస్థాన్‌ రాయల్స్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 24, 2026
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకకు చెందిన ఆల్‌రౌండర్ దసున్ షనక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ గాయపడటంతో జట్టుకు దూరమైన నేపథ్యంలో, అతని స్థానాన్ని భర్తీ చేయడానికి రాజస్థాన్ ఫ్రాంచైజీ షనకను ఎంపిక చేసింది. ఈ క్రమంలో షనకను రూ. 2 కోట్లకు జట్టులోకి తీసుకున్నారు. అందువల్ల అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో పాల్గొనకుండా, ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.

వివరాలు

కోచ్ సంగక్కర్ ప్రోత్సాహంతో ఎంట్రీ..

ఇప్పటికే జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబాని పీఎస్‌ఎల్‌ను విడిచి ఐపీఎల్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో షనక కూడా అడుగుపెడుతున్నాడు. ఐపీఎల్ మినీ వేలంలో షనకకు ఎలాంటి ఫ్రాంచైజీ అవకాశమివ్వకపోయినా, పీఎస్‌ఎల్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు అతడిని తీసుకుంది. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు కోచ్ సంగక్కర ప్రోత్సాహంతో షనకకు ఐపీఎల్‌లో అవకాశం లభించింది.

వివరాలు

రెండోసారి అవకాశం..

ఐపీఎల్‌లో ఇది షనకకు రెండోసారి ఆడే అవకాశం. 2023 సీజన్‌లో అతను గుజరాత్ టైటాన్స్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో 34 ఏళ్ల షనక శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అంతర్జాతీయ స్థాయిలో అతను ఇప్పటివరకు 6 టెస్టులు, 71 వన్డేలు, 131 టీ20 మ్యాచ్‌లు శ్రీలంక తరఫున ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చి తన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు.

Advertisement