
GT vs RR: రాజస్థాన్ రాయల్స్ ఘోర ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.
రాజస్థాన్ రాయల్స్‌ను ఆ జట్టు పరుగుల 58 పరుగుల తేడాతో చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.
సాయి సుదర్శన్ 82 పరుగులతో (53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి మద్దతుగా నిలిచాడు. లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది.
హెట్ మేయర్ 52 పరుగులు (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేయగా, కెప్టెన్ సంజు శాంసన్ 41 (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
Details
రాణించిన ప్రసిద్ధ కృష్ణ
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ట 3, రషీద్ ఖాన్, సాయి కిషోర 2 వికెట్లు తీయగా, సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ తలా ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ తనదైన శైలిలో అదరగొట్టాడు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్ తొలి బంతికే జోఫ్రా ఆర్చర్ వేసిన 147.7 కి.మీ. వేగంతో వచ్చిన బంతిని ఎదుర్కొనే క్రమంలో గిల్ (2) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
మరో ఎండ్‌లో సాయి సుదర్శన్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. జోస్ బట్లర్ (36; 25 బంతుల్లో 5 ఫోర్లు) స్థిరంగా ఆడి సహకరించాడు.
Details
చేలరేగిన సాయి సుదర్శన్
పదో ఓవర్‌లో మహీష్ తీక్షణ వేసిన బంతులకు సుదర్శన్ అర్ధశతకం (32 బంతుల్లో) పూర్తి చేశాడు.
అదే ఓవర్ చివరి బంతికి బట్లర్ అవుట్ అయ్యాడు. అప్పటికి గుజరాత్ స్కోరు 94/2. తర్వాత క్రీజులోకి వచ్చిన షారుక్ ఖాన్ (36; 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు.
ఫారూఖీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన షారుక్, తీక్షణ వేసిన 14వ ఓవర్‌లో వరుసగా 6, 4, 4 బాదాడు. అదే ఓవర్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
Details
చివర్లో రాహుల్ తెవాటియా మెరుపులు
రూథర్‌ఫోర్డ్ (7)ను సందీప్ శర్మ అవుట్ చేయగా, అదే ఓవర్‌లో సుదర్శన్ సిక్స్, ఫోర్ కొట్టి సెంచరీపై కన్నేసాడు. కానీ తుషార్ దేశ్‌పాండే వేసిన 19వ ఓవర్‌లో సుదర్శన్ అవుట్ అయ్యాడు.
అదే ఓవర్ చివర్లో రషీద్ ఖాన్ జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివరి ఓవర్‌లో రాహుల్ తెవాతియా (24 నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి స్కోరును 217కి చేర్చాడు.
రాజస్థాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే చెరో రెండు వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
58 పరుగుల తేడాతో గుజరాత్ విజయం
Match 23. Gujarat Titans Won by 58 Run(s) https://t.co/raxxjzY9g7 #GTvRR #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 9, 2025