Loading...
Rashid khan: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ప్రపంచంలో తొలి స్పిన్నర్‌గా రికార్డు
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ప్రపంచంలో తొలి స్పిన్నర్‌గా రికార్డు

Rashid khan: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ప్రపంచంలో తొలి స్పిన్నర్‌గా రికార్డు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో మూడుసార్లు ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌తో (IRE vs AFG) శుక్రవారం రాత్రి బ్రెడీ క్రికెట్ క్లబ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో రషీద్ ఖాన్ 6/34తో అద్భుతంగా బౌలింగ్ చేసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రషీద్ ఖాన్ గతంలోనూ వన్డేల్లో రెండుసార్లు ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. 2017 మార్చి 17న గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9.3 ఓవర్లు వేసిన రషీద్.. 43 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.

వివరాలు

చెలరేగిన రషీద్..

అదే ఏడాది జూన్ 9న గ్రోస్ ఐస్లెట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత చెలరేగాడు.

8.4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఏడు వికెట్లు తీశాడు.

వన్డేల్లో స్పిన్నర్లలో ఇప్పటివరకు అజంత మెండిస్ (శ్రీలంక), వానిందు హసరంగ (శ్రీలంక), ఇమ్రాన్ తాహిర్ (సౌతాఫ్రికా), షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్), అకిల ధనంజయ (శ్రీలంక), సందీప్ లామిచానే (నేపాల్) రెండేసిసార్లు ఆరు వికెట్ల ప్రదర్శన చేశారు.

వివరాలు

అత్యుత్తమ బౌలింగ్..

ఇప్పుడు రషీద్ ఖాన్ వారందరినీ అధిగమించి.. వన్డేల్లో మూడుసార్లు ఆరు వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు.

అయితే వన్డేల్లో ఓవరాల్‌గా అత్యధికసార్లు ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు మాత్రం పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ పేరిట ఉంది.

తన కెరీర్‌లో వకార్ యూనిస్ ఏకంగా ఐదుసార్లు ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 7/36గా ఉంది.

ADVERTISEMENT