ICC T20 Rankings: ఐసీసీ T20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో టీమిండియా(Team India) ప్లేయర్ల అధిపత్యం కొనసాగుతోంది. ఐసీసీ(ICC) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీ20 నెంబర్ వన్ బౌలర్‌గా స్పిన్నర్ రవి బిష్ణోయ్(Ravi Bishnoi) చోటు సంపాదించుకున్నాడు. ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో ఎగబాకాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భారత యువ స్పిన్నర్ అద్భుతంగా అదరగొట్టారు. ఐదు మ్యాచుల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఇక వానిందు హసరంగ, ఆదిల్ రషీద్, మహేష్ తీక్షణ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
అగ్రస్థానంలో సూర్యకుమార్ యాదవ్
టీ20ల్లో బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మహ్మద్ రిజ్వాన్, ఐడెన్ మర్ర్కమ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో 223 పరుగులతో రాణించి రుతురాజ్ గైక్వాడ్ (Ruthuraj Gaikwad) ఏడో స్థానానికి ఎగబాకాడు. ఆల్ రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో నిలిచాడు. టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మూడో స్థానంలో నిలిచాడు.