భారత్ ఆటగాళ్లను అభినందనలతో ముంచెత్తిన రవిశాస్త్రి.. ఫిక్సింగ్ ఆరోపణలు కొట్టిపారేసిన షోయబ్ అక్తర్
ఆసియా కప్ సూపర్ 4లో మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమిండియా కష్టపడి విజయం సాధించింది. శ్రీలంక స్పిన్ ధాటికి భారత జట్టు తక్కువ స్కోరుకే(213) పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోని, టీమిండియా బౌలర్లు లంక బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో టీమిండియా 41 రన్స్ తేడాతో గెలుపొందింది. ఇక భారత్ విజయం సాధించడంపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రీ స్పందించాడు. భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంసలతో ముంచెత్తాడు. పోరాడి గెలిస్తే వచ్చే మాజానే వేరుగా ఉంటుందని, సమిష్టి కృషితో విజయం సాధించిన భారత జట్టుకు ఇలాంటి విజయాలే కావాలని ఆయన పేర్కొన్నారు.
పాక్ జట్టు మళ్లీ పుంజుకుంటుంది : అక్తర్
మరోవైపు ఫాక్ ఫైనల్ కు రాకుండా భారత్-శ్రీలంక మ్యాచును ఫిక్స్ చేశారని పాకిస్థాన్ లో వచ్చిన ఆరోపణలు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కొట్టిపడేశాడు. పిక్స్ చేశారని మీమ్స్, మెసేజ్‌లను పాకిస్థాన్ అభిమానులు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదని, ఇండియా-పాక్ జట్ల మధ్య పోరు అద్భుతంగా సాగిందని, అయితే టీమిండియాతో జరిగిన మ్యాచులో పాక్ కనీసం పోటీ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. మళ్లీ పాకిస్థాన్ జట్టు పుంజుకుంటుందని షోయబ్ అక్తర్ అశాభావం వ్యక్తం చేశారు.