
Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకూడదంటూ రవిశాస్త్రి కీలక సూచన!
ఈ వార్తాకథనం ఏంటి
భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, అతడి వారసత్వ బాధ్యతలు ఎవరిదన్న దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్పిత్ బుమ్రా ఇప్పటికే రెండు టెస్టుల్లో జట్టును నడిపిన నేపథ్యంలో, అతడికే పూర్తి స్థాయి కెప్టెన్సీ అప్పగించాలని కొందరు వాదిస్తున్నారు.
అయితే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ మాత్రం బుమ్రాకే కెప్టెన్సీ ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ఈ విషయంలో ఆయన వివరణ ఇలా ఉంది:
'ఆస్ట్రేలియా సిరీస్ చూసిన తరువాత బుమ్రానే కెప్టెన్సీకి సరైన ఎంపిక అన్న అభిప్రాయం నాకు ఏర్పడింది.
Details
శుభ్‌మన్ గిల్ సరైన ఎంపిక
కానీ బుమ్రాను సారథిగా చేయడం ద్వారా మనం అతడిని ఒక బౌలర్‌గా కోల్పోతాం. ఇప్పుడే అతడు తీవ్రమైన గాయాల నుండి కోలుకుని తిరిగి బలపడుతున్నాడు.
ఐపీఎల్‌లో నాలుగు ఓవర్లే వేస్తున్నాడు. కానీ టెస్టుల్లో 10 నుంచి 15 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో కెప్టెన్సీ ఒత్తిడిని అతడిపై మోపడం మంచిది కాదని చెప్పారు.
రవిశాస్త్రి అభిప్రాయం ప్రకారం, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు సారథ్యం ఇవ్వడం సరైన నిర్ణయం కావొచ్చని ఆయన భావిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ మంచి ఎంపిక.
Details
పంత్, గిల్ కి కెప్టెన్సీ అనుభవం ఉంది
అతడి వయసు ఇప్పుడే 25. ఎదగడానికి పెద్ద అవకాశముంది. పంత్ కూడా మరో సమర్థవంతమైన ప్రత్యామ్నాయం.
వీరిద్దరికి కెప్టెన్సీ అనుభవం ఉంది. ఐపీఎల్‌లో సారథులుగా తాము ఏం చేయగలమో నిరూపించారు. వయసు పరంగా చూస్తే, వీరిద్దరూ ఇంకొంతకాలం భారత జట్టుకు సేవలందించగలగే స్థితిలో ఉన్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో భారత టెస్ట్ జట్టుకు కొత్త నాయకుడిగా శుభ్‌మన్ గిల్ లేదా రిషబ్ పంత్ ఎవరో ఒకరు బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.