టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ తప్పుకోవాలన్న రవిశాస్త్రి.. లేదంటే!
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దశాబ్దకాలంగా ఇండియన్ క్రికెట్ ను భూజాల మీదకు ఎత్తుకొని నడిపించారు. టీమిండియాకు ఇద్దరు కలిసి ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. ప్రస్తుతం వారికి టీ20 క్రికెట్ భారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు టీ20ల్లో యువకులు చెలరేగుతున్న వేళ.. ఈ ఇద్దరూ వాళ్ల స్పీడును అందుకోలేకపోయారు. తాజాగా ఈ ఇద్దరిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20ల నుంచి వాళ్లకు వాళ్లే తప్పుకోవాలని రవిశాస్త్రి అల్టిమేటం జారీ చేశాడు. ఒకప్పుడు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి ప్లేయర్స్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని రవిశాస్త్రి గుర్తు చేశాడు.
టెస్టులు, వన్డేల మీద శ్రద్ధ పెట్టాలి
ఎంతటి ప్లేయర్ అయినా ఓ స్థాయికి వచ్చిన తర్వాత తనకు తానుగా తప్పుకుంటేనే గౌరవమని, ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పరిస్థితి ఇలాగే ఉందని, 2024 టీ20 వరల్డ్ కప్ కోసం యువకుల వైపు చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తమకు తాముగా వాళ్లు తప్పుకోవాలని లేదంటే ఫామ్ తో పాటు ఫిట్ నెస్ కూడా చూడాల్సి వస్తుందని క్రికిన్ఫోతో రవిశాస్త్రి వెల్లడించారు. టీ20లను యువకులకు వదిలేసి కోహ్లీ, రోహిత్ లు టెస్టులు, వన్డేల వైపు చూడాలని ఆయన హితువు పలికారు.