Ravichandran Ashwin: చెన్నై చేరుకున్న అశ్విన్.. భారీగా స్వాగతం పలికిన అభిమానులు
భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇండియా, ఆస్ట్రేలియా గబ్బా టెస్ట్ డ్రా అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. 38 ఏళ్ల అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత మరుసటి రోజున గురువారం భారత్‌కు చేరుకున్నాడు. చెన్నైలోని తన ఇంటికి చేరుకున్న సమయంలో అశ్విన్‌కు కుటుంబ సభ్యులు,అభిమానులు ఆత్మీయ స్వాగతం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో జనసందోహం అక్కడ సమీకరించింది. వీడియోలో ఆయన రాకను బ్యాండ్ వాయిస్తూ, పూలవర్షం కురిపిస్తూ స్వాగతించడాన్ని చూడవచ్చు. ఆయనకు పూలమాలలు వేసి గౌరవించారు. ఇంటికి చేరుకున్న వెంటనే తన తండ్రిని కలిసిన అశ్విన్,ఆయనను కౌగిలించుకున్నారు. కొడుకుని కౌగిలించుకోగానే తల్లి ఆనంద పరవశం పొందింది.చివరిగా అభిమానుల కోసం ఆటోగ్రాఫ్‌లను అందించారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్
అశ్విన్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్ తీసుకున్న విషయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్న నేపథ్యంలో అతని నిర్ణయం చర్చనీయాంశమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ, అశ్విన్ ఐపీఎల్‌తో సహా క్లబ్ క్రికెట్‌లో కొనసాగనున్నాడు. 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడతాడు.భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. 106టెస్టుల్లో 537వికెట్లు పడగొట్టిన అశ్విన్ ముందు,619టెస్టు వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే మాత్రమే ఉన్నాడు. అంతేకాక,116 వన్డేల్లో 156 వికెట్లు,65 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 72వికెట్లు తీసిన అశ్విన్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు.