IND vs AUS : తెలివిగా ఖావాజాను ఔట్ చేసిన అశ్విన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు అలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 76 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఖావాజా డకౌట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ తెలివిగా బౌలింగ్ ఖావాజాను అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ దగ్గర ఫుల్ డెలివరీ అశ్విన్ వేయగా.. డిఫెండ్ చేయడానికి ఖవాజా ముందుకొచ్చాడు. వెంటనే కేఎస్ భరత్ చేతిలోకి బంతి వెళ్లింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఖావాజా రివ్యూ కోరినా ఫలితం లేకుండా పోయింది.
సులభంగా లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా
2వ రోజు, రెండో ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా 156/4 వద్ద ప్రారంభించింది. ఈ ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు , పేసర్ ఉమేష్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. 88 పరుగుల వెనుకంజలో ఉన్న టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా.. 109 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. నాథన్ లియాన్ 64 పరుగులకే ఎనిమిది వికెట్లు పడగొట్టి విజృంభించాడు. భారత్ తరుపున చతేశ్వర్ పుజారా 59 పరుగులతో రాణించాడు. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి సులభంగా లక్ష్యాన్ని చేధించింది.