LOADING...
Women's World Cup: న్యూజిలాండ్‌పై భారత్‌ ఘనవిజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా 
న్యూజిలాండ్‌పై భారత్‌ ఘనవిజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా

Women's World Cup: న్యూజిలాండ్‌పై భారత్‌ ఘనవిజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే ప్రపంచకప్‌లో మూడు ఓటముల తర్వాత,భారత మహిళా క్రికెట్ జట్టు గెలుపు బాట పట్టింది. గురువారం,న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి,సెమీఫైనల్లో స్థానం ఖరారు చేసుకుంది. వర్షం కారణంగా డక్‌వర్త్-లూయిస్ పద్ధతిలో ఫలితం నిర్ణయించబడిన మ్యాచ్‌లో, 44 ఓవర్లలో 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎదుర్కొన్న కివీస్ జట్టు కేవలం 271 పరుగులే చేయగలిగింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌లలో బ్రూక్ హాలిడే (81; 84 బంతుల్లో 9 ఫోర్లు,1 సిక్సర్),ఇసబెల్లా గేజ్ (65 నాటౌట్; 51 బంతుల్లో 10 ఫోర్లు),అమేలియా కెర్ (45; 53 బంతుల్లో 4 ఫోర్లు) పోరాడారు. భారత బౌలర్లు రేణుక సింగ్ (2/25),క్రాంతి గౌడ్ (2/48),ప్రతీక రావల్ (1/19) రాణించారు.

వివరాలు 

ఆ ముగ్గురూ నిలిచినా..:

మొదట ఓపెనర్లు ప్రతీక రావల్ (122; 134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు),స్మృతి మంధాన (109; 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్; 55 బంతుల్లో 11 ఫోర్లు) మెరుపులు తోడవడంతో, భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఛేదనలో కివీస్‌ ఎంతో మెరుగ్గా బ్యాటింగ్‌ చేసినప్పటికీ,సాధించాల్సిన లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆ జట్టు ఏ దశలోనూ గెలుపు రేసులో లేదు. రెండో ఓవర్‌లోనే క్రాంతి గౌడ్ సుజీ బేట్స్ (1)ను ఔట్‌ చేయడంతో కివీస్‌ ఛేదన పేలవంగా ఆరంభమైంది.

వివరాలు 

ముందు ఓపెనర్లు.. తర్వాత జెమీమా: 

జార్జియా ప్లిమ్మర్ (30),అమేలియా కొంతసేపు నిలకడగా ఆడినప్పటికీ, ప్లిమ్మర్,కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ (6) త్వరగా ఔట్ కావడంతో, గెలుపు ఆశలు అంతరించాయి. అమేలియా, ఇసబెల్లా గేజ్‌లతో భాగస్వామ్యాలు నెలకొల్పింది. కానీ వీరి పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే ఉపయోగపడింది. మొదట టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కివీస్ ఆ నిర్ణయానికి ఎంతో చింతించేలా సాగింది భారత ఇన్నింగ్స్‌ గత మ్యాచ్‌లలో స్మృతి, ప్రతీక ఆశించిన ప్రారంభం ఇవ్వలేకపోయినా,ఈ మ్యాచ్‌లో అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టు బలమైన పునాది వేసింది. స్మృతి చెలరేగి ఆడినప్పటికీ, ప్రతీక సంయమనంతో షాట్లను ఆడుతూ, సందర్భానుసారంగా అవకాశాలను సద్వినియోగం చేసింది. భారత జట్టు 18వ ఓవర్‌లో వంద పరుగులు దాటింది, 33వ ఓవర్‌లో 200 పరుగుల మార్కును చేరుకుంది.

వివరాలు 

సెమీస్ స్థానం ఖాయం 

స్మృతి 88 బంతుల్లో శతకాన్ని సాధించి, 10 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టింది. ప్రతీక కూడా సెంచరీ వైపు అడుగులు వేస్తూ, జెమీమాతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపింది. ప్రతీక 122 బంతుల్లో మూడంకెల స్కోరు సాధించిన తర్వాత ఔట్ అయ్యింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న జెమీమా ఆఖరి ఓవర్లలో మెరుపులు మెరిపించి, భారత జట్టుకు భారీ స్కోరు అందించింది. న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన భారత్, సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కుంటుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు, కివీస్ ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. ఆ మ్యాచ్ ఫలితాల ఆధారంగా సంబంధం లేకుండా, భారత్ ముందంజలో ఉంది.

వివరాలు 

అగ్రస్థానంలో నిలిచే జట్టుతో సెమీస్

ఆ రోజు బంగ్లా చేతిలో భారత్‌ ఓడి, ఇంగ్లాండ్‌పై కివీస్‌ గెలిస్తే ఇరు జట్ల పాయింట్లు సమమవుతాయి. ఒకవేళ నెట్‌ రన్‌రేట్‌లో భారత్‌ను అధిగమించినా కివీస్‌ ముందంజ వేయదు. అందుకు కారణం .. భారత్‌ ఖాతాలో ఎక్కువ విజయాలుండడమే. కాబట్టి, నాలుగో స్థానంతోనే భారత జట్టు సెమీస్‌లో చేరుతుంది. అగ్రస్థానంలో నిలిచే జట్టుతో సెమీస్‌ ఆడుతుంది. 7 స్మృతి, ప్రతీక మధ్య శతక భాగస్వామ్యాలు. భారత్‌ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన మిథాలి రాజ్, పూనమ్‌ రౌత్‌ జోడీని సమం చేశారు. మిథాలి, పూనమ్‌ 34 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకుంటే.. స్మృతి, ప్రతీకలకు 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డును అందుకున్నారు.

వివరాలు 

14

స్మృతి వన్డే శతకాలు. మహిళల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో రెండో స్థానానికి చేరింది. బేట్స్‌ (న్యూజిలాండ్, 13)ను దాటేసింది. మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా, 15) అగ్రస్థానంలో ఉంది. 212 స్మృతి, ప్రతీక జోడించిన పరుగులు. ఈ ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. మొత్తంగా భారత్‌ తరఫున తొలి వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. జనవరిలో ఐర్లాండ్‌పై 233 పరుగులతో స్మృతి, ప్రతీక జోడీనే రికార్డు నెలకొల్పింది. 331 ఈ ప్రపంచకప్‌లో స్మృతి పరుగులు. టోర్నీలో ఆమెనే టాప్‌స్కోరర్‌. ప్రతీక (308) రెండో స్థానంలో ఉంది. 340 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కిదే అత్యధిక స్కోరు.

వివరాలు 

భారత్‌ ఇన్నింగ్స్‌: 

ప్రతీక (సి) హన్నా(బి) అమేలియా 122;స్మృతి (సి) హన్నా(బి)బేట్స్‌ 109; జెమీమా నాటౌట్‌ 76; హర్మన్‌ప్రీత్‌ (సి) కార్సన్‌ (బి) మైర్‌ 10; రిచా నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 19 మొత్తం:(49 ఓవర్లలో 3 వికెట్లకు) 340 న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: బేట్స్‌ (సి) ప్రతీక (బి) క్రాంతి 1; ప్లిమ్మర్‌ (బి) రేణుక 30;అమేలియా (సి) స్మృతి (బి)స్నేహ్‌ రాణా 45; సోఫీ డివైన్‌ (బి) రేణుక 6;హాలిడే (సి) స్నేహ్‌ రాణా(బి)శ్రీచరణి 81; మ్యాడీ (సి)క్రాంతి (బి) ప్రతీక 18; ఇసాబెల్లా నాటౌట్‌ 65; జెస్‌ (సి) స్మృతి (బి) క్రాంతి 18; రోజ్‌మేరీ (సి)స్మృతి (బి) దీప్తి 1; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం:(44 ఓవర్లలో 8 వికెట్లకు) 271.