
RCB: ఫ్యాన్స్ సేఫ్టీకి ఆర్సీబీ హామీ.. ఆరు పాయింట్ల మ్యానిఫెస్టో రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి ప్రతిస్పందనగా తమ అభిమానుల సంక్షేమం కోసం ఆర్సీబీ 'RCB Cares' పేరుతో ప్రత్యేక ఫ్రాంచైజీని ప్రారంభించింది. ఇప్పటికే బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. తాజాగా ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా ఆరు అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అభిమానులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనకూడదనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Details
ఫ్యాన్స్ కు అండగా ఉంటాం
'RCB Caresతో మా 12th మ్యాన్ ఆర్మీకి అండగా నిలిచేందుకు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాం. అందుకోసం కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తున్నాం. మా జట్టు అడుగుజాడల్లో నిలిచే ప్రతి అభిమానికి మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నామని ఆర్సీబీ పోస్టులో పేర్కొంది. అభిమానుల సంక్షేమంపై తమ కట్టుబాటు తెలియజేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.
Details
ఆర్సీబీ మ్యానిఫెస్టోలోని కీలక అంశాలు ఇవి
1. ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా అభిమానులకు అన్ని విధాల మద్దతు ఇవ్వడం. జట్టు వల్ల ఇబ్బందులు పడే అభిమానులు, వారి కుటుంబాలకు పారదర్శకంగా, వేగంగా సహాయం అందించడం. 2. అభిమానుల భద్రత కోసం కఠిన చర్యలు చేపట్టడం. స్టేడియం అధికారులు, క్రీడా సంఘాలు, లీగ్ భాగస్వాములతో కలిసి పని చేసి భారీగా వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం. 3. గ్రామీణ కర్ణాటకలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి సంఘాలను బలోపేతం చేయడం. గొప్ప అవకాశాలు సృష్టించడం. 4. అభిమానుల భద్రత కోసం స్వతంత్రంగా పరిశోధనలు చేయడం. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ముందుగానే సిద్ధం కావడం కోసం తగిన ఇన్వెస్ట్‌మెంట్ చేయడం.
Details
ఆర్సీబీని స్పూర్తిని కొనసాగిస్తాం
5. అభిమానులకు గుర్తుండిపోయేలా ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవడం. వారి గౌరవార్థం బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం. ఆర్సీబీ స్ఫూర్తిని కొనసాగించడం. 6. భావితర క్రీడాకారులకు అండగా నిలవడం. స్థానిక ప్రతిభను గుర్తించి వారికి ఆర్థిక సహాయం, అవకాశాలు కల్పించడం. ఉన్నతస్థాయికి చేరుకునేలా మద్దతు ఇవ్వడం. ఈ విధంగా, బెంగళూరు ఘటన అనంతరం ఆర్సీబీ అభిమానుల భద్రత, సంక్షేమంపై మరింత బాధ్యత వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.