LOADING...
Yash Dayal: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆర్‌సిబి ఆటగాడిపై జైపూర్‌లో కేసు నమోదు
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆర్‌సిబి ఆటగాడిపై జైపూర్‌లో కేసు నమోదు

Yash Dayal: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆర్‌సిబి ఆటగాడిపై జైపూర్‌లో కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ కు మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌కి చెందిన యువతి అతడిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా, రాజస్థాన్‌కు చెందిన మరో యువతి యశ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనకు క్రికెట్‌లో మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని నమ్మించి రెండేళ్లుగా యశ్‌ తనపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా రాజస్థాన్ పోలీసులు యశ్ దయాల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

వివరాలు 

రెండేళ్లపాటు బ్లాక్‌మెయిల్ చేస్తూ, అనేకసార్లు అత్యాచారం

ఫిర్యాదు ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జైపూర్‌లో యశ్ దయాల్‌ను తొలిసారి కలిసినట్లు యువతి తెలిపింది. అతను తనకు క్రికెట్‌ సలహాలు ఇస్తానని చెప్పి, సీతాపుర్లోని ఓ హోటల్‌కు పిలిపించి అక్కడే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆ తర్వాత రెండేళ్లపాటు బ్లాక్‌మెయిల్ చేస్తూ, అనేకసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనలు ప్రారంభమైన సమయంలో తన వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనని పేర్కొంది. అందుకే ఈ కేసులో పోక్సో చట్టాన్ని వర్తింపజేసినట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో నేరం నిరూపితమైతే, కనీసం పది సంవత్సరాల నుంచి జీవితఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది.

వివరాలు 

గాజియాబాద్‌కు చెందిన యువతి కూడా తీవ్ర ఆరోపణలు 

ఇక ఇదే యశ్ దయాల్‌పై గత నెల ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన మరో యువతి కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. గత అయిదేళ్లుగా తాను యశ్‌తో సంబంధం కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.అతను తాను కాబోయే కోడలంటూ తనను ఇంటికి పరిచయం చేశాడని, అనంతరం శారీరకంగా,మానసికంగా హింసించాడు అని తెలిపింది. కొంతకాలానికి అతడికి ఇతర యువతులతో సంబంధాలున్న విషయాన్ని తెలుసుకున్నట్లు పేర్కొంది. ఈ ఆధారంగా పోలీసులు యశ్‌పై కేసు నమోదు చేశారు.అయితే ఈ ఆరోపణలను యశ్ దయాల్ ఖండించాడు.

వివరాలు 

ఆర్సీబీ జట్టులో కీలక బౌలర్‌

తర్వాత అలహబాద్ హైకోర్టును ఆశ్రయించగా, అతనిపై అరెస్టును నిలిపివేస్తూ కోర్టు స్టే ఇచ్చింది. క్రికెట్ విషయానికి వస్తే, యశ్ దయాల్‌ తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో ప్రారంభించాడు. ఆ సీజన్‌లో అతడు మొత్తం 11 వికెట్లు తీశాడు. ఇక 2025లో ఆర్సీబీ జట్టులో చేరిన అతడు కీలక బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 13 వికెట్లు తీసి ఆర్సీబీ ట్రోఫీ గెలుచుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.