LOADING...
RCB: బెంగళూరు తొక్కిసలాట జరిగిన మూడు నెలల తర్వాత.. మౌనంవీడిన ఆర్‌సీబీ
బెంగళూరు తొక్కిసలాట జరిగిన మూడు నెలల తర్వాత.. మౌనంవీడిన ఆర్‌సీబీ

RCB: బెంగళూరు తొక్కిసలాట జరిగిన మూడు నెలల తర్వాత.. మౌనంవీడిన ఆర్‌సీబీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు 15 ఏళ్ల నిరీక్షణ తరువాత 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను సాధించింది. జూన్ 3న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై విజయాన్ని సాధించి, RCB ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో బెంగళూరులోని అభిమానులు ఎంతో ఆనందంలో మునిగిపోయారు. అయితే, ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. జూన్ 4న బెంగళూరులో ఆర్‌సీబీ విజయ పరేడ్ సందర్భంగా జరిగిన తీవ్ర గందరగోళంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు. ఈ విషాదంపై ఆర్‌సీబీ మూడు నెలల తర్వాత స్పదించింది.

వివరాలు 

ఆర్‌సీబీ పోస్ట్‌లో ఏముంది? 

తన సొషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా స్పందించింది. ఆ పోస్ట్‌లో "జూన్ 3న మాకు అమితమైన ఆనందం కలిగింది, కానీ జూన్ 4న అన్ని పరిస్థితులు మారిపోయాయి" అని వెల్లడించింది. మేము మౌనంగా ఉన్నామంటే, అది మేము లేనట్లు కాదు. అది మా బాధ. ఈ ప్రదేశం ఎప్పుడూ అభిమానుల ఉత్సాహంతో, జ్ఞాపకాలతో, ఆనందకర క్షణాలతో నిండి ఉండేది. కానీ జూన్ 4న జరిగిన ఘటన తర్వాత ఆ ఇక్కడ నిశ్శబ్దం ఆవరించింది.ఈ నిశ్శబ్దంలో మేము బాధపడ్డాం, విన్నాం, నేర్చుకున్నాం. ఈ పరిస్థితిలో, కేవలం స్పందించడం కాకుండా, ఏదో సానుకూలమైన పని చేయాలని మేము నిర్ణయించుకున్నాం.ఇప్పుడు మేము నిజంగా నమ్మే ఒక పనిని చేయబోతున్నాం"

వివరాలు 

తోక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్‌సీబీ  రూ. 10 లక్షల చొప్పున సహాయం

ఆ పోస్ట్‌లో ఆర్‌సీబీ ఇంకా.. ఈ ఆలోచన ఫలితంగా RCB "RCB CARES" అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ,అభిమానులను గౌరవించడం,వారి బాధను కొంత తగ్గించడం, వారికి మద్దతుగా ఉండడం లక్ష్యంగా ఏర్పడింది. RCB సృష్టించిన ఈ కొత్త ప్రక్రియ ద్వారా వారు కేవలం విజయం సాధించడం మాత్రమే కాదు, తమ అభిమానులను ముందుకు తీసుకువెళ్ళడంలోనూ ముందుంటారు. జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు RCB ఇప్పటికే ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం అందించింది. RCB CARES కార్యక్రమం ద్వారా, కర్ణాటక రాష్ట్రానికి గర్వంగా నిలిచేలా, RCB ఎల్లప్పుడూ అభిమానులకు అండగా ఉంటుందని, వారికి మద్దతుగా ఉండేలా పనిచేస్తుందని ఆ జట్టు ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేసిన ట్వీట్