లెస్బియన్ అని ఒప్పుకున్న బాక్సర్
మహిళల ఫెదర్‌వెయిట్ విభాగంలో ఒలింపిక్ కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఇటాలియన్ బాక్సర్ ఇర్మా టెస్టా తాను లెస్బియన్ అనే విషయాన్ని ప్రకటించింది. ఈ నిజాన్ని బహిరంగంగా చెప్పడం ఎంతో ధైర్యానిచ్చిందని పేర్కొంది. 2023లో జరుగుతున్న IBA ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వచ్చిన ఆమెకి అపూర్వమైన ప్రేమ, మద్దతు లభించిందన్నారు. ఇర్మా ఇటలీలోని అనేక మంది యువ, ఔత్సాహిక మహిళా బాక్సర్‌లకు స్ఫూర్తిగా నిలిచింది. మొత్తం 48 పతకాలు (15 స్వర్ణాలు, 15 రజతాలు, 18 కాంస్యాలు) గెలుచుకొని రికార్డు బద్దలు కొట్టింది. ఇర్మా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చింది. క్రీడల్లో ఏదో ఒకటి చేసి తనకంటూ ఓ పేరును సంపాదించాలనే పట్టుదలతో ఉండేది.
రెండు బంగారు పతకాలను సాధించిన ఇర్మా టెస్టా
ఇర్మా 12 సంవత్సరాల వయస్సులో బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుంది. తన అక్కతో పాటు బాక్సింగ్ రాణించాలనుకున్నా.. దురదృష్టవశాత్తు తన అక్క 14 సంవత్సరాల వయస్సులో పనికి వెళ్లాల్సి వచ్చింది. ఆరుగురు వ్యక్తుల కుటుంబాన్ని పోషించడానికి డబ్బు కోసం చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఆమె ఒలింపిక్స్‌లో టోక్యో 2020 కాంస్య పతకంతో పాటు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లలో 2019, 2022లో రెండు బంగారు పతకాలను సాధించింది. తన భవిష్యత్ గురించి ఆమె మాట్లాడుతూ.. ఇటాలియన్ క్లెయిమ్‌లు జరుగుతున్న IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో బాగా రాణించి, జూన్‌లో జరిగే ఒలింపిక్ క్వాలిఫైయర్‌లపై దృష్టి సారించానని వెల్లడించింది.