Page Loader
18 సంవత్సరాలకే వన్డేలోకి ఇంగ్లండ్ కుర్రాడు ఎంట్రీ
రెహ్మన్ అహ్మద్ గతేడాది అండర్-19 ప్రపంచ కప్ ఆడాడు

18 సంవత్సరాలకే వన్డేలోకి ఇంగ్లండ్ కుర్రాడు ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2023
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌కు చెందిన ఆల్ రౌండర్ రెహాన్ అహ్మద్ కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లోకి ఇంగ్లండ్‌ తరుపున అత్యంత పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసిన ఆటగాడిగా రెహాన్ అహ్మద్ రికార్డు సృష్టించాడు. మార్చి 6 బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ఈ మైలురాయిని ఆల్‌రౌండర్ అహ్మద్ సాధించాడు. గతేడాది పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అహ్మద్ ఇంగ్లండ్‌కు అత్యంత పిన్న వయస్కుడిగా టెస్టులోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఐసిసి అండర్-19 ప్రపంచకప్‌లో అహ్మద్ పాల్గొన్నాడు. వెటరన్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ గతంలో 18 ఏళ్ల 205 రోజులకు తన తొలి వన్డే క్యాప్‌ను అందుకున్నాడు.

ఇంగ్లండ్

విల్ జాక్స్ స్థానంలో రెహ్మన్ అహ్మద్ ఎంపిక

ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ గాయపడటంతో అతని స్థానంలో రెహ్మన్ అహ్మద్ ఎంపికయ్యాడు. అహ్మద్ ఆగస్టు 13, 2004న నాటింగ్‌హామ్‌లో జన్మించాడు. లెగ్-స్పిన్నర్‌‌గా, బ్యాట్‌మెన్‌గా జట్టుకు సేవలందించనున్నాడు. అండర్-19 ప్రపంచ కప్ 2022లో ఇంగ్లాండ్ గెలుచుకోవడంలో అహ్మద్ కీలక పాత్ర పోషించాడు. చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న చివరి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్‌ను 2-0తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. చివరి వన్డేలో ఇంగ్లండ్ తరుపున అహ్మద్‌, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్‌లను స్థానం లభించింది.