Mohammed Shami: మహ్మద్ షమీ కూతురిపై మత పెద్దల విమర్శలు.. కారణం ఇదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ సందర్భంగా, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి.
రంజాన్ మాసంలో ఉపవాసం (రోజా) పాటించకపోవడంపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ విమర్శలు గుప్పించారు.
క్రికెట్ మ్యాచ్ సమయంలో నీరు, ఇతర పానీయాలు తాగడాన్ని తప్పుబడుతూ, షమీని ఓ 'క్రిమినల్' అంటూ అభివర్ణించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా షమీకి మద్దతు లభించింది. ఇదంతా ఇంకా చల్లారకముందే, ఇప్పుడు షమీ కూతురిని లక్ష్యంగా చేసుకుని షాబుద్దీన్ కొత్త విమర్శలు చేశారు.
హోలీ వేడుకల్లో పాల్గొనడాన్ని షరియత్‌కు విరుద్ధం అంటూ అభిప్రాయపడ్డారు.
Details
రంజాన్ మాసంలో ఉపవాసం పాటించకపోతే పాపిగా పరగణిస్తాం
శనివారం రాత్రి విడుదల చేసిన ఒక వీడియోలో, ఆమె చిన్న వయస్సులో అర్థం చేసుకోకుండా హోలీ ఆడితే పెద్ద తప్పేం కాదు.
అయితే అన్నీ తెలిసి కూడా హోలీ జరుపుకుంటే, అది షరియత్‌కు వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.
తాను షమీతో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా హెచ్చరించాను. షరియత్‌లో లేనిదాన్ని మీ పిల్లలు అనుసరించనివ్వకండి. హోలీ హిందువులకు ఎంతో మహత్తరమైన పండుగ, కాని ముస్లింలు దీన్ని జరుపుకోవడం షరియత్‌కు విరుద్ధమన్నారు.
అంతేకాదు, షరియత్ నియమాలను పాటించడం ముస్లింలందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఇస్లాంలో ఉపవాసం తప్పనిసరని గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగా ఉపవాసం పాటించకపోతే, ఇస్లామిక్ చట్టాల ప్రకారం అతడిని పాపిగా పరిగణిస్తారని పేర్కొన్నారు.