LOADING...
టీమ్ ఓటమి కారణంగా కెప్టెన్సీకి రాజీనామా
టెస్టు కెప్టెన్‌గా తప్పుకున్న కరుణరత్నే

టీమ్ ఓటమి కారణంగా కెప్టెన్సీకి రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ చేతిలో 2-0తేడాతో సిరీస్ కోల్పోయిన తరుణంలో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 18) తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ ప్రకటించారు . ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు కరుణ్ రత్నే తెలియజేశాడు. 2019లో శ్రీలంక జట్టు టెస్టు కెప్టెన్సీ చేపట్టిన కరుణరత్నే తొలి సిరీస్ లోనే సౌతాఫ్రికాపై చరిత్రక విజయం అందించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ రెండు టెస్టు మ్యాచ్ లు ఓడిపోవడంతో లంకేయులు టెస్టుల్లో ప్రస్తుతం ఏడో స్థానంలో నిలిచారు. జట్టులో సాధరణ సభ్యుడిగా కొనసాగుతానని కరుణరత్నే స్పష్టం చేశారు.

కరుణరత్నే

26 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కరుణరత్నే

కొత్త టెస్టుకు కొత్త కెప్టెన్‌ని సెలక్టర్లు నియమించడం మంచిదని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కరుణరత్నే తెలిపారు. ఇప్పటి వరకు 26 టెస్టుల్లో శ్రీలంకకు కరుణరత్నే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లలో 47.70 సగటుతో 2,242 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 12 అర్ధసెంచరీలను బాదాడు. అతని కెప్టెన్సీలో శ్రీలంక 10 విజయాలు నమోదు అయ్యాయి. ఇందులో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లపై సిరీస్ అను అతని సారథ్యంలో గెలుచుకున్నారు. టెస్టుల్లో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా కరుణరత్నే నిలిచాడు. టెస్టుల్లో మొత్తం 6,230 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలున్నాయి.