Page Loader
IPL 2025: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, మరో నలుగురిని రిటైన్ చేస్తుంది: ఆకాష్ చోప్రా 
ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, మరో నలుగురిని రిటైన్ చేస్తుంది: ఆకాష్ చోప్రా

IPL 2025: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, మరో నలుగురిని రిటైన్ చేస్తుంది: ఆకాష్ చోప్రా 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2024
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు, ముంబై ఇండియన్స్‌ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్‌ స్థానంలో మహేల జయవర్థనే నియమితులయ్యారు. ఐపీఎల్ 2024లో బౌచర్‌ కోచ్‌గా ఉన్న సమయంలో రోహిత్‌ శర్మని కెప్టెన్‌గా తొలగించి, హార్దిక్‌ పాండ్యాని నియమించడం జరిగింది. హార్దిక్‌ ఫామ్‌లో లేకపోవడం, జట్టులో సమన్వయ లోపం కారణంగా, ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. గత కొద్దిరోజులుగా రోహిత్‌ జట్టును వీడతాడనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో,టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. ముంబై ప్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

వివరాలు 

 ఒకరిని అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా తీసుకునేందుకు ముంబై 

ముఖ్య ఆటగాళ్లను రిటైన్‌ చేసేందుకు రూ.79 కోట్లు వెచ్చించినా,ముంబై ఫ్రాంచైజీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ, "మహేల జయవర్థనే తిరిగి ముంబై జట్టులో చేరడం వల్ల జట్టులో మార్పులు జరుగుతాయి. హర్థిక్ పాండ్యా ఫామ్‌లోకి వచ్చాడు. కాబట్టి ఐదుగురు కీలక ఆటగాళ్లను రిటైన్‌ చేసుకొని ఒకరిని అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా తీసుకునేందుకు ముంబై చూస్తుంది. హార్దిక్‌ సహా రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ లేదా ఇషాన్‌ కిషన్‌ని రిటైన్‌ చేసుకునే అవకాశముంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నెహాల్‌ వధేరాని తీసుకోవాలని భావిస్తోంది. వీరికి రూ.79 కోట్లు వెచ్చించి, మిగతా మొత్తంతో వేలానికి వెళ్ళనున్నారని పేర్కొన్నాడు."

వివరాలు 

నవంబర్ చివరలో ఐపీఎల్ వేలం 

"మహేల జయవర్థనే గొప్ప ఆటగాడు. బ్యాటర్, కెప్టెన్‌గా శ్రీలంకకు ఎన్నో విజయాలు అందించాడు. అతడికి ముంబైతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. బౌలింగ్ కోచ్‌గా పరాస్‌ మాంబ్రేని నియమించడం మంచి విషయం. గత సీజన్‌లో జట్టు బౌలింగ్‌ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ముంబైకి బౌలింగ్‌ కోచ్‌ అవసరం. అందుకే పరాస్‌ను తీసుకుంది"అని ఆకాశ్‌ చోప్రా తెలిపారు. ఐపీఎల్ 2025 వేలం నవంబర్ చివరలో జరిగే అవకాశాలు ఉన్నాయి. రిటైన్‌ జాబితాను సమర్పించేందుకు ఈ నెల చివరి వరకు గడువు ఉంది.