
MS Dhoni: సచిన్ తర్వాత ధోనికి అరుదైన గౌరవం.. ఏడో నంబర్ జెర్సీకి వీడ్కోలు పలికిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) క్రికెట్ వీడ్కోలు పలికి మూడేళ్లు దాటిని అతని క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.
భారత జట్టుకు ఆడినన్ని రోజులు ధోని విశిష్ట సేవలందించాడు.
దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనికి భారత క్రికెట్ బోర్డు(BCCI) అరుదైన గౌరవం కల్పించింది.
భారత్ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) నంబర్ 10 జెర్సీకీ చాలా ప్రాముఖ్యత ఉంది.
సచిన్ రిటైర్మెంట్ తరువాత అతని జెర్సీ నంబర్ 10 కి బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది.
తాజాగా మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ అదే గౌరవాన్ని ఇచ్చింది.
Details
రెండో ఆటగాడిగా ధోని గుర్తింపు
ఇకపై ధోని జెర్సీ నంబర్‌ని ఎవరికి కేటాయించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
దీంతో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ధోని రికార్డుకెక్కాడు.
ఎంఎస్ ధోని ఏడో నంబర్ జెర్సీని ఎవరూ ఎంచుకోవద్దని ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు, యంగ్ స్టర్స్ చెప్పామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ప్రస్తుతం ఆటగాళ్ల కోసం 60 సంఖ్యలు ఉన్నాయని, ఒకవేళ ఏ ప్లేయర్ అయినా ఏడాది కాలం జట్టుకు జట్టుకు దూరమైతే అతడి జెర్సీ నంబర్ కొత్తవాళ్లకు ఇవ్వమని చెప్పారు.