LOADING...
ICC: టెస్టు క్రికెట్‌లో విప్లవాత్మక మార్పు.. 2-టైర్ టెస్టులకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్? 
టెస్టు క్రికెట్‌లో విప్లవాత్మక మార్పు.. 2-టైర్ టెస్టులకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్?

ICC: టెస్టు క్రికెట్‌లో విప్లవాత్మక మార్పు.. 2-టైర్ టెస్టులకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టు క్రికెట్ అభివృద్ధిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలకంగా దృష్టి సారించింది. అలాగే 12 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్స్ లీగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగపూర్‌లో ఐసీసీ ఛైర్మన్ జై షా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా వంటి ప్రముఖ బోర్డులు హాజరయ్యాయి. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు హాజరుకాలేకపోయారు.

Details

సీఈవో నేతృత్వంలో కమిటీ

ఇటీవలే ఐసీసీ సీఈవోగా నియమితులైన సంజోగ్ గుప్తా నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ, 2-టైర్ టెస్టు క్రికెట్ విధానం అమలుపై పరిశీలన చేయనుంది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొమ్మిది జట్లు పోటీపడుతున్నాయి. టోర్నీ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో ఉన్న తొలి రెండు జట్లు ఫైనల్‌కి అర్హత సాధిస్తాయి. విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ ప్రైజ్‌మనీతో పాటు ప్రతిష్టాత్మక గదను బహుమతిగా ఇస్తుంది.

Details

2027-29 సీజన్ లో అమల్లోకి వచ్చే అవకాశం

2-టైర్ విధానం అమలులోకి వస్తే, టెస్టు దేశాలు రెండు గ్రూపులుగా విడిపోతాయి. ప్రతి గ్రూపులో ఆరేసి జట్లు ఉండగా, వాటి ప్రదర్శన ఆధారంగా ప్రమోషన్ లేదా డిగ్రేడేషన్ జరుగుతుంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలు ప్రతి నాలుగేళ్లకు రెండు టెస్టు సిరీసుల్లో తలపడుతున్నాయి. అయితే, ఈ నూతన ఫార్మాట్‌తో ఆ వ్యవధి మూడేళ్లకు తగ్గే అవకాశం ఉంది. అయినా, ఈ మార్పులు 2027-29 సీజన్ నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

Details

ఛాంపియన్స్ లీగ్‌కి మళ్లీ రంగం సిద్ధం 

ఇంకొకవైపు, ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 11ఏళ్ల విరామం తర్వాత 'ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నమెంట్' ను పునఃప్రారంభించనుంది. చివరిసారిగా 2014లో ఈ టోర్నీ నిర్వహించగా, చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచి కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫైనల్‌లో ఓడించింది. అప్పటి నుంచి ఈ టోర్నీ పూర్తిగా నిలిపివేసింది. ఇప్పటి పరిస్థితుల్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి దేశాల్లో పెద్దఎత్తున లీగ్‌లు జరుగుతున్నాయి. ఈ దేశాల టాప్‌-2జట్లు 2026లో జరగనున్న ఛాంపియన్స్ లీగ్‌లో తలపడే అవకాశముంది. ఈమెగా టోర్నీకి వేదిక ఎక్కడ ఉండనుందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు ఈ నిర్ణయాలన్నింటి లక్ష్యం టెస్టు క్రికెట్‌కు కొత్త ఊపునివ్వడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడమేనని స్పష్టమవుతోంది.