Rishabh Pant-IPL 2024: రిషబ్ పంత్ కి క్లీన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్ లో పునరాగమనం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ ఆడుతాడా లేదా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ ఇప్పుడు వీడింది.
పంత్‌కి సంబంధించి బీసీసీఐ పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. అతను ఐపిఎల్ 17వ సీజన్‌లో ఆడతాడని స్పష్టం చేసింది.
అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారథ్య బాధ్యతలు అందుకోనున్నట్లు తెలిపింది.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వైద్య బృందం పంత్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ఎన్‌సీఏ పేర్కొంది.
అతను బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ పాత్రలను పోషించగలడని కూడా బీసీసీఐ చెప్పింది. అంటే పంత్ రెండు పాత్రలలో IPL 2024 ఆడటం మనం చూడవచ్చు.
Details
IPL 2024లో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ పాత్రలో రిషబ్ పంత్
డిసెంబర్, 2022న జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు.
అనంతరం ఎన్‌సీఏలో పునరావాసం పొందాడని బీసీసీఐ తెలిపింది. అయితే ఎన్‌సీఏ వైద్య బృందం సమక్షంలో కఠినమైన వ్యాయామాలు చేసి ఫిట్‌నెస్ సాధించాడు.
పంత్ ఇప్పుడు IPL 2024లో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ పాత్రను పోషించడానికి పూర్తిగా సిద్ధమయ్యాడు.
ఇప్పుడు BCCI రిషబ్ పంత్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించినందున, సీజన్ మొత్తంలో పంత్ వికెట్ కీపింగ్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాటింగ్ చేస్తూ కనిపించే అవకాశం ఉంది.
ఇదే జరిగితే ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కెప్టెన్సీ డైలమా కూడా ముగిసిపోతుంది. అంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా కూడా కనిపిస్తాడు.
Details
ఐపీఎల్ 2024కి దూరంగా మరో ఇద్దరు ఆటగాళ్లు
రిషబ్ పంత్‌తో పాటు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు సంబంధించిన అప్‌డేట్‌లను బీసీసీఐ కూడా ఇచ్చింది.
ప్రసిద్ధ కృష్ణ ప్రస్తుతం వైద్య బృందం పరిశీలనలో ఉన్నారని, ఐపీఎల్ 2024కి దూరంగా ఉన్నారని భారత బోర్డు అప్‌డేట్ ఇచ్చింది.
బీసీసీఐ ఇచ్చిన మరో అప్డేట్ ప్రకారం మహ్మద్ షమీ ఈ IPL ఆడటం లేదు.