Page Loader
IPL 2024: రిషబ్ పంత్ కు భారీ జరిమానా.. ఫైన్‌ బారిన పడ్డ రెండో కెప్టెన్‌ గా రిషబ్ 
: రిషబ్ పంత్ కు భారీ జరిమానా.. ఫైన్‌ బారిన పడ్డ రెండో కెప్టెన్‌ గా రిషబ్

IPL 2024: రిషబ్ పంత్ కు భారీ జరిమానా.. ఫైన్‌ బారిన పడ్డ రెండో కెప్టెన్‌ గా రిషబ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2024
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు భారీ షాక్ తగిలింది. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఢిల్లీ చేసిన తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఇకపోతే, ఈ ఐపీఎల్‌ సీజన్ లో ఫైన్‌ బారిన పడ్డ రెండో కెప్టెన్‌ రిషబ్ పంత్‌. ఇంతకుముందు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌కు జరిమానా విధించారు. ఈ సీజన్ లో రెండు వరుస పరాజయాల తరువాత రిషబ్ పంత్ సేన తోలి విక్టరీ సాధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 చెన్నైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్