IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తన తదుపరి కెప్టెన్‌గా భారత బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేసుకుంది.
లక్నో యాజమాన్యం, మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు పంత్‌ను సొంతం చేసుకుని, అతనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పంత్, అంచనాలను మించిపోతూ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. 3, 4, 5, 6 కోట్లు అంటూ తన ధర ఒక్కో కోటి పెరిగింది.
చివరికి రూ. 27 కోట్లు పలికింది. ఈ క్రమంలోనే పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు ఇప్పటికే ప్రచారం నడుస్తోంది.
Details
గతంలో దిల్లీ కెప్టెన్ గా పనిచేసిన పంత్
అయితే పూరన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఐడెన్ మర్‌క్రమ్ జట్టులో ఉండటంతో కెప్టెన్సీ బాధ్యత ఎవరికి ఇవ్వాలని చర్చలు జరిగినా, చివరికి స్వదేశీ ఆటగాడు పంత్ మీదే టీమ్ నమ్మకాన్ని పెట్టింది.
2016లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన పంత్‌కు ఇది రెండవ ఫ్రాంచైజీ.
గతంలో పంత్ దిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా పని చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 111 మ్యాచుల్లో 3,284 పరుగులు చేసి, వాటిలో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలున్నాయి.